ఈమధ్య కాలంలో లక్కీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక మందన్ననే. ఎందుకంటే కన్నడ నుండి టాలీవుడ్ కి దూసుకొచ్చి ఇక్కడ టాప్ చైర్ కి దగ్గరై ఇక్కడి నుండి బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ స్టార్స్ ఛాన్సెస్ పట్టేసింది. అంతేకాదు.. తమిళంలోనూ రష్మిక విజయ్ తో ఛాన్స్ పట్టేసి ఎగ్జైట్ అవుతుంది. మలయాళంలోనూ నెగెటివ్ టచ్ ఉన్న కేరెక్టర్ లో దుల్కర్ సీత రామమ్ లో నటిస్తుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక మధ్యలో బర్త్ డే పార్టీలు, అవార్డు ఫంక్షన్స్ కి టూ మచ్ గ్లామర్ షో చేస్తూ అందరి చూపు తనవైపే తిప్పుకుంటుంది.
తాజాగా రష్మిక సోషల్ మీడియాలో రెండు ఫొటోస్ ని షేర్ చేసింది. నేషనల్ క్రష్‌గా అందరి నోళ్ళలో నానుతున్న రష్మిక ఆ పిక్స్ లో ఛిల్ అవుతూ కూల్ గా కనిపించింది. జీన్స్ ప్యాంట్, జీన్స్ జాకెట్ వేసుకుని లూజ్ హెయిర్ తో సిగ్గుపడుతూ కాదు చిన్న స్మైల్ ఇస్తున్న ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ రష్మిక ఎంత క్యూట్ గా ఉంది, సింపుల్ స్మైల్ తో ఆకట్టుకునేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.