మెగా ఫాన్స్ కి వరసగా గుడ్ న్యూస్ లే వినిపిస్తున్నాయి. అందులో మొదటిది మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ నుండి జులై 4 న అంటే రేపు సోమవారం ఫస్ట్ లుక్ రాబోతుంది. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ లో చిరు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్ లాల్ ని లూసిఫర్ గా చూసిన జనాలు, ఇప్పుడు మెగాస్టార్ ఆ లుక్ లో ఎలా ఉండబోతున్నారో అనే క్యూరియాసిటీ ఎక్కువైపోతోంది. ఫాన్స్ ఆత్రుతకి తెర దించుతూ ఫస్ట్ లుక్ డేట్ లాక్ చేసారు మేకర్స్.
మరో న్యూస్ ఏమిటి అంటే RC 15 నుండి రామ్ చరణ్ లుక్ లోడింగ్ అంటూ చరణ్ అప్ డేట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేలా ఉంది ఈ అప్ డేట్. రామ్ చరణ్ - శంకర్ కలయికలో మూడు లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న RC15 టైటిల్ పై, ఫస్ట్ లుక్ పై ఎప్పటినుండో కొన్ని పేర్లు, డేట్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా పర్సనల్ స్టైలిస్ట్ చేతిలో మేకోవర్ అవుతున్న వీడియో ని రిలీజ్ చేస్తూ RC 15 లుక్ లోడింగ్ అంటూ అప్ డేట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు. దానితో వరస గుడ్ న్యూస్ లు వింటున్న ఫాన్స్ కి పూనకాలు రావడం కాదు జోష్ లో పండగ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ వెంటనే RC15 లుక్ అబ్బో ఫాన్స్ కి మాములు ట్రీట్స్ కాదు మరి..