విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రేక్షకులలో సినిమా పై అంచనాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. ఆగస్టు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఇది కొంత ట్రోల్స్ కి కారణం అవుతుంది.
పోస్టర్ ఎలా ఉందో అన్న అంశంపై పలువురు యాంటీ ఫ్యాన్స్, వ్యతిరేక వర్గం వంటి వారు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ విషయాన్నీ స్పష్టం చేశారు. అయితే కొన్ని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ లలో పాల్గొనబోయే ఫైటర్ ల బరువును కొలవడానికి వారు న్యూడ్ గా ఉంటారు. వారి బరువును గ్రామ్ లలో కొలవానికి ఒంటిమీద నూలు పోగు కూడా ఉంచరు. ఈ లీగ్స్ ను ఫాలో అయ్యే వారికి ఇది బాగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి సింబాలిక్ గా ఈ పోస్టర్ ను అలా విడుదల చేశారు.
ఇక ఈ పోస్టర్ కు ప్రేక్షకుల దగ్గరినుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పోస్టర్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఈ పోస్టర్ ఇంస్టాగ్రామ్ లో వేగంగా 1 మిలియన్ మార్క్ కు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి పోస్టర్ ఇదే కావడం మరింత విశేషం. మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సెన్సేషనల్ సినిమా గా రాబోతున్న ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి మరిన్ని రికార్డులను నెలకొల్పుతుందా అనేది చూడాలి.