తనని హాట్ యాంకర్ గా నిలబెట్టి, కెరీర్ లో అవకాశాలు కల్పించిన జబర్దస్త్ షో కి అనసూయ గుడ్ బాయ్ చెప్పెయ్యబోతుంది అంటూ సోషల్ మీడియాలో అనేకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నా అనసూయ మాత్రం ఆ వార్తలను కొట్టిపారెయ్యకుండా కామ్ గా చూస్తుంది. తన డ్రెస్సింగ్ స్టయిల్, అలాగే తన యాటిట్యూడ్ మీద కామెంట్స్ చేసే నెటిజెన్స్ తాట తీసే అనసూయ ఇప్పుడు ఇలా కామ్ గా ఉండడం చూసి నిజమే అనసూయ జబర్దస్త్ ని వదిలేస్తుంది అని ఫిక్స్ అవుతున్నారు జనాలు.
అయితే అనసూయ వెండితెర అవకాశాలు ఎక్కువై జబర్దస్త్ ని వదలడం లేదు అని, ఆమెకి కూడా జబర్దస్త్ లో ప్రాధాన్యత తగ్గుతున్న కారణంగానే ఆమె ఈ షో నుండి తప్పుకుంటుంది అంటున్నారు. అంటే ప్రస్తుతం కమెడియన్స్ లేక జబర్దస్త్ షో ఢీలా పడిపోయింది. సరైన కామెడీ చేసే నాధుడు కనిపించక ఏదో స్పెషల్ స్కిట్స్ అంటూ లాగించేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ షో ఆగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. అందుకే అనసూయ కామ్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది, లేదంటే ఆగిపోయాక పక్కకి జరిగితే పరువు పోతుంది అని ఇలా చేసింది అనే టాక్ వినిపిస్తుంది.