మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ కి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూసాం. కొరటాల రైటింగ్ స్కిల్స్, చరణ్ పెరఫార్మెన్స్, మెగాస్టార్ క్రేజ్ ఏమి ఆచార్య కి హెల్ప్ అవ్వలేకపోయాయి. అయితే తాజాగా ఆచార్య సినిమా గురించి ప్రముఖ రచయిత పరచూరి గోపాల కృష్ణ కామెంట్స్ చేసారు. ఈమధ్యనే సినిమా చూసిన ఆయన.. ఆచార్య సినిమా చూస్తున్నంతసేపు మరోమలుపు సినిమా చూసినట్లుగా ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఆచార్యని సినిమాలా చూస్తే బానే ఉంటుంది. కానీ కథలోని ఓ ముఖ్యమైన ఘటన, ఎందుకు, ఎలా జరిగింది అనేది చెప్పకుండా కథని నడిపించిన తీరు ఆడియన్స్‌కి అర్ధం కాలేదు.
రామ్ చరణ్ కేరెక్టర్‌ని ఫస్ట్ హాఫ్ లో కూడా ప్రవేశపెట్టినట్టయితే బావుండేది. అసలు సస్పెన్స్, ఎమోషన్ రెండు ఒకే చోట ఇమడవు. డైలాగ్స్, కథాంశం, పెరఫార్మెన్స్ అన్నీ బావున్నాయి. కానీ ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ ఓ పది నిముషాలు ఉంచితే బావుండేది. అలాగే సిద్ద కేరెక్టర్‌ని రామ్ చరణ్ చెయ్యకుండా ఉంటే బావుండేది. ఇంకా చిరు కేరెక్టర్‌ని 90 శాతం ఉంచాల్సింది. అంతేకాకుండా విప్లవ భావాలున్న చిరు చేత డాన్స్ చేయించకుండా ఉంటే బావుండేది. అసలు ఈ సినిమాకి ఆచార్య టైటిల్ కరెక్ట్ కాదనిపించింది అంటూ పరచూరి ఆచార్య సినిమాపై సెన్సేషనల్ కామెట్స్ చేసారు.