రాశి ఖన్నా ఒకప్పుడు బబ్లీగా ఉన్న హీరోయిన్. కానీ ఇప్పుడు చాలా స్లిమ్ గా గ్లామర్ గా తయారయ్యింది. బొద్దుగా ఉన్నా మొదటినుండి గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకోని ఈ భామ సన్నబడ్డాక మరీ ఎక్కువ ఎక్సపోజింగ్ చేస్తుంది. ఇప్పుడు రాశి ఖన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది. హిందీ వెబ్ సీరీస్, తెలుగులో నాగ చైతన్య తో థాంక్యూ మూవీ లో నటించిన రాశి ఖన్నా కి స్టార్ హీరోల అవకాశాలు మాత్రం తగలడం లేదు. అయితే తాజాగా రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఆ సినిమాలో సీరియల్స్ లో నటించే అమ్మాయిగా రాశి ఖన్నా గ్లామర్ షో చేసింది. కామెడీ చేయడంలో తడబడినా.. అందాలు ఆరబోసే విషయంలో ఎక్కడా తగ్గలేదు. చాలా స్లిమ్ గా అందంగా కనిపించింది ఆమె. గ్లామర్ పరంగా రాశి ఖన్నాకు వంకబెట్టవలసిన పనిలేదు కానీ సినిమా కి వచ్చిన టాకే ఆమె ని ఇబ్బందుల్లో పడేసింది. పక్కా కమర్షియల్ టాక్ తేడా కొట్టడంతో రాశి ఖన్నా ఢీలా పడిపోయింది. ఇక ఈ సినిమా ఎలా ఉన్నా ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ నాగ చైతన్య థాంక్యూ మీదే పెట్టుకుంది. కాకపోతే ఆ సినిమాలో మరో ఇద్దరి హీరోయిన్స్ తో రాశి ఖన్నా పోటీపడుతోంది. ఆ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతుంది.