Advertisementt

చంద్రబాబు పై పోటీ: విశాల్ రియాక్షన్

Fri 01st Jul 2022 09:48 PM
actor vishal,ap politics,tdp,chandra babu,kuppam,2024 elections  చంద్రబాబు పై పోటీ: విశాల్ రియాక్షన్
Vishal denies contesting in elections against Chandrababu చంద్రబాబు పై పోటీ: విశాల్ రియాక్షన్
Advertisement
Ads by CJ

రెండు రోజులుగా నటుడు విశాల్ 2024 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై కుప్పంలో పోటీ చెయ్యబోతున్నాడు అంటూ వైసీపీ కి సపోర్ట్ వెబ్ సైట్స్ లో కథనాలు వెలువడ్డాయి. తమిళనాడు లో ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేని విశాల్ చంద్రబబు పై పోటీ అంటూ వెటకారంగా రాసుకొచ్చాయి. అయితే ఇలాంటి న్యూస్ లకి బదులివ్వకపోతే అదే నిజమనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే హీరో విశాల్ చంద్రబాబు పై పోటీ చేసే విషయంలో సుత్తి లేకుండా సూటిగా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

నేను ఆంధ్రలోని కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు పై పోటీ చేస్తున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, నేను ఆ వార్తలని ఖండిస్తున్నాను, పొలిటికల్ ఎంట్రీ పై ఇప్పటివరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు, ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది, ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కానీ, కుప్పంలో పోటీ చేసే ఉద్దేశ్యం కానీ లేదు, అసలు ఇలాంటి వార్తలు ఎలా పుడతాయి.. పుట్టిస్తారో అంటూ తాను కుప్పంలో పోటీ చేసే విషయాన్ని క్లుప్తంగా కొట్టిపారేశాడు విశాల్. 

Vishal denies contesting in elections against Chandrababu:

Actor Vishal Denies Entry Into AP Politics

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ