Advertisementt

పవిత్ర లోకేష్ నాకు ఫ్రెండ్ మాత్రమే: నరేష్

Fri 01st Jul 2022 09:32 PM
actor naresh,ramya raghupathi,pavitra lokesh,sr naresh  పవిత్ర లోకేష్ నాకు ఫ్రెండ్ మాత్రమే: నరేష్
Naresh and Pavitra Lokesh Reaction on Relationship పవిత్ర లోకేష్ నాకు ఫ్రెండ్ మాత్రమే: నరేష్
Advertisement
Ads by CJ

నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై నరేష్ స్పందించారు. తన మాజీ భార్య రమ్య ఎటువంటిదో ఆయన మీడియా ముందు బయట పెట్టారు. తన భార్య ఏనాడూ సక్రమంగా లేదు అని, ఆమెకు వేరే వారితో ఎఫ్ఫైర్స్ ఉన్నాయని, పవిత్ర లోకేష్ తో నాలుగేళ్ళ నుండి పరిచయం ఉంది అని, ఆమె తనకి అన్ని విషయాల్లో తోడుగా ఉంది అని, పవిత్ర లోకేష్ తనకి మంచి ఫ్రెండ్ అని, కానీ రమ్య పవిత్రపై నాపై నిందలు వేసింది అని, ఆమెతో నేను కలిసే ఉంటున్నట్లుగా రూమర్స్ క్రియేట్ చేసింది అని, ఇదంతా నేను ఆమెకి విడాకుల నోటీసులు పంపాకే ఇలాంటి రూమర్స్ ని రమ్య స్ప్రెడ్ చేసింది అంటూ నరేష్ చెప్పారు.

మరోపక్క నటి పవిత్ర లోకేష్ కూడా వివరణ ఇచ్చారు. నా గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. నరేష్ గారు, వారి కుటుంబం గురించి కూడా తెలుగు వారికి తెలుసు రమ్యరఘుపతి నా గురించి కన్నడలో చాలా తప్పుగా ప్రచారం చేశారు. నరేష్ గారు, నేను రిలేషన్ షిప్ లో ఉన్నామని ప్రచారం చేసిన రమ్య నన్ను ఓ బాదితురాలిని చేశారు. కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే సరి చేసుకోవాలి. రమ్యరఘుపతి మాటలు నన్ను ఎంతగానో బాధించాయి అంటూ పవిత్ర లోకేష్ మాట్లాడారు. 

Naresh and Pavitra Lokesh Reaction on Relationship:

Actor Naresh Reaction on his 3rd Wife Ramya Raghupathi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ