మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ గా రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో చిరు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా ఆయనకి సిస్టర్ గా కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. అలాగే చిరు కి బాడీ గార్డ్ గా బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ మూవీ ఆగష్టు కానీ, సెప్టెంబర్ లో కానీ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మెగాస్టార్ చిరు క్లూ ఇచ్చినప్పటినుండి ఆ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా.. మెగాస్టార్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వదులుతారా అని మెగా ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.
దానికి ముహూర్తం పెట్టారు. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం పెట్టి డేట్ లాక్ చేసి మరీ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. భీబత్సమైన వర్షం, ఆ వర్షంలో ఓ కారు.. దాని చుట్టూ వందలాదిమంది గొడుగులతో కనిపిస్తున్న ఆసక్తికర పిక్ తో జులై 4 సాయంత్రం 5.45 నిమిషాలకు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక గాడ్ ఫాదర్ లో ఓ ఎపిసోడ్ లో ఖైదీగాను కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు పాత్రకి హీరోయిన్ కానీ, సాంగ్స్ కానీ ఉండకపోయినా.. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. సత్య దేవ్ నయనతార భర్తగా, విలన్ గా కనిపించబోతున్నారు.