జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోబోతుంది, అందుకే ఆమె ఎమోషనల్ గా అలాంటి ట్వీట్ చేసింది, ఇకపై జబర్దస్త్ స్టేజ్ పై అనసూయ అందాలు చూడడం కష్టమే అంటూ గత రెండు రోజులుగా అనసూయ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. అనసూయ జబర్దస్త్ కి బై బై చెప్పబోతున్నట్లుగా ఎక్కడా డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆమె చేసిన ట్వీట్ అలానే ఉంది అంటూ ఇకమీదట అనసూయ జబర్దస్త్ లో కనబడదని ఫిక్స్ అవుతున్నారు చాలామంది. అంతలోనే అనసూయ తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి వచ్చే యాంకర్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. దానితో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకొచ్చేశాయి.
అందులో ముందుగా యాంకర్ శ్రీముఖి అనసూయ ప్లేస్ ని ఆక్రమించొచ్చు అనేలోపే.. శ్రీముఖి నో చెప్పింది అనే వార్త కూడా బయటకి వచ్చేసింది. తర్వాత మరో యాంకర్ మంజూష పేరు తెరపైకి వచ్చింది. రాఖి సినిమాలో ఎన్టీఆర్ కి సిస్టర్ గా నటించిన మంజూష.. తర్వాత సినిమా ఈవెంట్స్ లో గ్లామర్ షో చేస్తుంది. ఈమధ్యన సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇప్పుడు అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంటే మంజూష రావొచ్చని.. మల్లెమాల యాజమాన్యం మంజూషని సంప్రదిస్తుంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. మరి అనసూయ ఎప్పుడు వెళ్ళేనూ.. ఎప్పుడు కొత్త యాంకర్ ని చూస్తాము అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.