ప్రభాస్ - అనుష్క పెయిర్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకే కాదు, ఇండియన్ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్. బాహుబలితో అంతలాంటి ట్రెండ్ సెట్ చేసారు ఈ ఇద్దరు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తుంటే అనుష్క మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. నిశ్శబ్దం మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క బరువు ఆమెని వెక్కిరించింది. అయితే తాజాగా ప్రభాస్ తో అనుష్క మరోసారి జోడికట్టబోతుంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అది కూడా ప్రభాస్ - మారుతి కలయికలో తెరకెక్కబోతున్న రాజా డీలక్స్ మూవీలో. ఇప్పటివరకు మారుతి - ప్రభాస్ మూవీ అనౌన్సమెంట్ రాలేదు కానీ.. ఆ సినిమా కి టైటిల్ గా రాజా డీలక్స్ పెట్టబోతున్నారని, ఇందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు అని, అలాగే ఈ మూవీ అంతా ఇండోర్ లోనే ఓ ఇంటి సెట్ లోనే షూటింగ్ జరగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ కి జోడిగా అనుష్క ఫిక్స్ అంటున్నారు. మరి మారుతి మాత్రం నేను చెప్పేవరకు వెయిట్ చెయ్యండి.. ఎలాంటి గాసిప్స్ నమ్మవద్దువు అంటున్నాడు. మరో పది రోజుల్లో ప్రభాస్ - మారుతి మూవీ అనౌన్సమెంట్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది.