Advertisementt

పది రోజుల్లో ప్రభాస్ సినిమా అనౌన్సమెంట్

Fri 01st Jul 2022 10:06 AM
prabhas,maruti,prabhas - maruti movie announcement,raja delux  పది రోజుల్లో ప్రభాస్ సినిమా అనౌన్సమెంట్
Prabhas - Maruti movie announcement soon పది రోజుల్లో ప్రభాస్ సినిమా అనౌన్సమెంట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్స్ ని లాక్ చేసి ఓ ప్రాజెక్ట్ ఆదిపురుష్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసి.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్స్ లో యమా బిజీగా వున్నారు. అన్నీ పాన్ ఇండియా మూవీస్ అవడం వలన ప్రభాస్ లైనప్ అదిరిపోయేలా ఉంది. వీటి తర్వాత స్పిరిట్ చెయ్యాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చే ఏడాది మొదలు కాబోతుంది. ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ అనౌన్సమెంట్ రావాల్సి ఉంది. అందులో బాలీవుడ్ సిద్దార్ద్ ఆనంద్ మూవీ ఒకటి, అలాగే టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతీ మూవీ ఒకటి.

అందులో మారుతీ ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాపై టాలీవుడ్ లో చాలా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ సినిమాకి ప్రభాస్ ఎప్పుడో ఓకె చెప్పారు. అఫీషియల్ అనౌన్సమెంట్  రావాల్సి ఉంది. ముందు పక్కా కమర్షియల్ రిలీజ్ అవ్వనివ్వండి, తర్వాత ప్రభాస్ సినిమా విషయాలు చెబుతాను అంటూ మారుతి చెప్పాడు. అయితే ఈ రోజు పక్కా కమర్షియల్ రిలీజ్ అయ్యింది. ఇక ప్రభాస్ మూవీ అనౌన్సమెంట్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా మారుతి పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఓ పది రోజుల్లో ప్రభాస్ తో మూవీ ఎనౌన్సమెంట్ ఉండబోతుంది అని చెప్పాడు. దానితో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో సూపర్ క్లారిటీ వచ్చింది. 

Prabhas - Maruti movie announcement soon:

Prabhas - Maruti movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ