కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ హాట్ అయిన విక్రమ్ మూవీ జూన్ 3 న విడుదలైంది. అయితే విక్రమ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ.. విడుదలైన 35 రోజుల్లోనే ఈ సినిమాని ఓటిటి రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్. హిట్ సినిమా కి 50 రోజుల గ్యాప్ కూడా విక్రమ్ లెక్క చెయ్యడకుండా జులై 8 న ఓటిటి రిలీజ్ అంటూ అధికారికంగా ప్రకటించేసారు. విక్రమ్ రిలీజ్ అయిన జూన్ 3 నే విడుదలై సక్సెస్ అయిన మరో పాన్ ఇండియా ఫిలిం మేజర్ సినిమా ఓటిటి రిలీజ్ పై ఓ డేట్ ప్రచారంలోకి వచ్చింది.
కానీ మేజర్ మూవీ కూడా అనుకున్న తేదీ కన్నా ముందే, 50 రోజుల తర్వాత కాకుండా ముందే ఓటిటి రిలీజ్ కి వచ్చేసింది, బాక్సాఫీస్ వద్ద అయితే భారీ స్థాయిలో విజయాన్ని మూటగట్టుకున్న ఈ మేజర్ మూవీని విడుదలైన నెల రోజుల్లోనే అంటే జులై మొదటి వారం లోనే నేటి ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ చూస్తున్నారట. అది కూడా పర్టిక్యులర్ గా జూలై నెల 3వ తేదీ నుంచి ఇండియాలోని నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో మేజర్ సందడి చేయబోతోంది అని తెలుస్తుంది.