Advertisementt

మెట్రో స్టేషన్ లో ప్రాజెక్ట్ కె షూట్

Thu 30th Jun 2022 02:01 PM
project k,prabhas,amitab,nag ashwin,salaar  మెట్రో స్టేషన్ లో ప్రాజెక్ట్ కె షూట్
Project K racing in Metro మెట్రో స్టేషన్ లో ప్రాజెక్ట్ కె షూట్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నాగ్ అశ్విన్ - ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే స్టే చేసారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్, సలార్ షూటింగ్స్ పారలాల్ గా చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ కె ని వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో వైజయంతి మూవీస్ వారు కొత్త ఆఫీస్ ని అమితాబ్ చేతుల మీదుగా ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, దుల్కర్ సల్మాన్, నాని, రాఘవేంద్ర రావు, ప్రభాస్ హాజరయ్యారు.

అయితే ప్రోజెక్ట్ కే షూటింగ్ కోసం అమితాబచ్చన్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో సందడి చేసారు. నాగ్ అశ్విన్ అండ్ టీం మెట్రో స్టేషన్ లో కొన్ని సీన్స్ చిత్రీకరణ చేపట్టారు. అందుకోసమే అమితాబ్ మెట్రో స్టేషన్ కి రావడంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు అమితాబ్ ని చూసేందుకు పోటీపడ్డారు. అక్కడ మెట్రో స్టేషన్ లో అమితాబ్ ని ఓ నెటిజెన్ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంకా ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

Project K racing in Metro:

Project K shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ