అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమా మారేడుమిల్లి ప్రజానీకం నుండి టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఒకప్పుడు కమెడియన్ గా సినిమాలు చేసిన అల్లరి నరేష్ మహర్షి సినిమా, నాంది సినిమాతో తనలోని సీరియస్ నెస్ ని బయటికి తీసాడు. నాంది లో పోలీస్ ల వలన జైలుకెళ్లి బాధలు పడిన యువకుడిగా తనలోని మరో యాంగిల్ ని చూపించిన అల్లరి నరేష్ ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలోనూ అదే సీరియస్ నెస్ పాత్రని చేసారు. దట్టమైన అడవులని చూపిస్తూ ట్రైబల్ ఏరియాలలో కొంతమంది ప్రజలు ఇంతవరకు ఓటు వేసి కూడా ఉండరు అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో టీజర్ ని మొదలుపెట్టారు.
మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఉండే ప్రజలకు రోడ్లు లేక, ఏది కావాలన్నా మైళ్ళ దూరం వెళ్లి కావాల్సినవి తెచ్చుకోవాల్సిన పరిస్తితుల్లో ఉన్న ఊర్లకి ఓట్లు అడగడానికి వచ్చే ప్రజాప్రతినిధులు, పోలీస్ ల లాఠీ దెబ్బలు అంటూ ఇంట్రెస్టింగ్ గా మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ని కట్ చేసారు. అల్లరి నరేష్ మరోసారి నటనకు ప్రాధాన్యత నిచ్చే బరువైన పాత్రలో కనిపిస్తున్నారు. 25 కిలోమీటర్లు ఇవతలికి వస్తే కానీ వీళ్ళిలా బ్రతుకుతున్నారని మనకి కూడా తెలియలేదు, వీళ్ళని చూస్తుంటే బాధపడాలో, జాలిపడాలో కూడా తెలియడం లేదు అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని టీజర్ కి హైలెట్ అయ్యేలా ఉన్నాయి.