సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్రాక్ తో అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా వుంది. ప్రభాస్ తో ఏకంగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది. మరోపక్క టాలీవుడ్ సీనియర్స్ బాలకృష్ణ, చిరంజీవి లతో స్టెప్స్ వెయ్యడానికి రెడీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ లో కళ కనబడుతుంటే శృతి హాసన్ మాత్రం తెగ బాధపడిపోతోంది. కారణం ఆమె హార్మోన్స్ ఇమ్‌బ్యాలెన్స్ తో ఇబ్బందులు పడుతున్నట్లుగా స్వయంగా చెబుతుంది. శారీరకంగా చాలా వీక్ గా ఉన్నాను అని, కానీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను అంటూ శృతి హాసన్ చెబుతుంది.
తాము ప్రస్తుతం హార్మోన్స్ సమస్యలతో ప్రోబ్లెంస్ ఫేస్ చేస్తున్నట్లుగా చెప్పడమే కాదు, దాని నుండి బయట పడేందుకు వర్కౌట్ చేస్తున్న వీడియో ని కూడా షేర్ చేసింది. కొన్ని రోజులుగా కొన్ని చెత్త హార్మోన్స్ తో బాధపడుతున్నాను అని, వీటి నుండి బయటపడేందుకు ఫైట్ చేస్తున్నా, హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి అమ్మాయికి తెలుసు. దీని నుండి బయటపడాలంటే పోరాడాలి, భయపడకూడదు. వాటిని నియంత్రించాలంటే సమయానికి తినడం, సరిపడ నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వర్కౌట్స్ చెయ్యాలి. వర్కౌట్స్ చెయ్యడం, నిద్రపోవడం వలన మానసికంగా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటివి బయట పెట్టడానికి చాలామంది మహిళలు ఆలోచిస్తారు. కానీ ఇలాంటి సవాళ్లను మనం ధైర్యంగా స్వీకరించాలి. అందుకే నేను మీతో పంచుకుంటున్నాను అంటూ శృతి హాసన్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.