గోపీచంద్ - మారుతి కాంబోలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటు హీరోగా గోపీచంద్ కి, అటు దర్శకుడిగా మారుతికి పక్కా కమర్షియల్ హిట్ చాలా ముఖ్యం. అలాగే టాలీవుడ్ లో స్టార్ అవకాశాల కోసం వెయిట్ చేసున్న రాశి ఖన్నాకి ఈ సినిమా హిట్ అవసరమే. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పక్కా కమర్షియల్ పై ట్రేడ్ లో అయితే అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నాయో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇక పక్కా కమర్షియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్ జరిగింది. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ లెక్కలు మీ కోసం..
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 6 కోట్లు
సీడెడ్ 2.50 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ కలిపి: 17.50 కోట్లు
ఇతర ప్రాంతాలు: 50 లక్షలు
ఓవర్సీస్ 1.25 కోట్లు
వరల్డ్ వైడ్ గా 19.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది