Advertisementt

కరోనాని జయించిన బాలయ్య..

Thu 30th Jun 2022 10:52 AM
balakrishna,covid,nbk  కరోనాని జయించిన బాలయ్య..
Balakrishna recovers from covid కరోనాని జయించిన బాలయ్య..
Advertisement
Ads by CJ

కరోనా మరోసారి విజృంభిస్తుంది. కరోనా వలన పెద్దగా ప్రమాదం లేకపోయినా.. అక్కడక్కడా కోవిడ్ మరణాలు వింటూనే ఉన్నాము. మరోసారి కరోనా పంజా విసురుతున్న టైం లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ కి కరోనా పాజిటివ్ గా తేలగా ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉంది అని, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నట్టుగా బాలకృష్ణ స్వయంగా తెలపడంతో ఆయన ఫాన్స్ కూల్ అయ్యారు. 

తాజాగా జ‌రిపిన కోవిడ్ టెస్టులో బాలకృష్ణ కి నెగెటివ్ రావ‌టంతో ఆయన పూర్తిగా కరోనా నుండి కోలుకున్నార‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. ఓ వారం పాటు బాలకృష్ణ రెస్ట్‌లో ఉండి.. తర్వాత యధావిధిగా షూటింగ్స్ కి హాజరవుతారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో NBK -107 చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కి ఓకె చెప్పారు. ఈ సినిమా సెప్టెంబర్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Balakrishna recovers from covid:

Balakrishna kills covid, ready to roar

Tags:   BALAKRISHNA, COVID, NBK
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ