Advertisementt

విడాకులపై ఏం క్లారిటీ ఇచ్చారు

Wed 29th Jun 2022 10:18 PM
hema chandra,sravana bhargavi,divorce,singers  విడాకులపై ఏం క్లారిటీ ఇచ్చారు
Hema chandra And Sravana Bhargavi Gives Full Clarity About Divorce విడాకులపై ఏం క్లారిటీ ఇచ్చారు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి - హేమ చంద్ర లు విడిపోతున్నారు అంటూ పలు వెబ్ సైట్స్ లోనూ, సోషల్ మీడియాలో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. 2013 లో ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న ఈ జంట చాలాసార్లు కలిసి సంతోషంగా కనిపించారు. అలాగే హేమచంద్ర - శ్రావణ భార్గవికి ఓ పాప కూడా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాపురంలో వారి మధ్యన విభేదాలు తలెత్తినా పెద్దలు సరిచేశారు కానీ.. ఇప్పుడు వారి మధ్యన ఏర్పడిన విభేదాలు విడాకులు వరకు వెళ్లాయంటూ ఆ న్యూస్ ల్లో వస్తున్న కథనాలు.

తాజాగా హేమ చంద్ర - శ్రావణ భర్గవి విడి విడిగా తమ విడాకులపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారనిపిస్తుంది. సోషల్ మీడియాలో హేమ చంద్ర.. ముందు నేను పాడిన పాటలకంటే అనవసరమైన చెత్త రూమర్స్ మాత్రం తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిని నమ్మి జనాలు టైం వెస్ట్ చేసుకుంటున్నారు అంటూ స్పందించగా.. శ్రావణ భార్గవి కూడా.. గత కొద్ది రోజులుగా నా యూట్యూబ్‌ ఛానల్‌లోని వీడియోలకు వ్యూస్‌ పెరుగుతున్నాయి. అంతేకాకుండా నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు కూడా పెరిగారు. దానితో నాకు పని పెరిగింది, అలాగే నా ఆదాయం కూడా పెరిగింది. తప్పో ఒప్పో అంతా మీడియా వల్లే జరిగింది.. అంటూ విడాకుల మేటర్ ని తేల్చేసారు ఈ సింగర్ ఇద్దరూ..

కాకపోతే కొంతమంది ఏం క్లారిటీ ఇచ్చారు వీరిద్దరూ.. అసలు అవుననా.. కాదనా అనే కన్ఫ్యూషన్ లో చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Hema chandra And Sravana Bhargavi Gives Full Clarity About Divorce:

Hema Chandra and Sravana bhargavi gives clarity about their divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ