సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈ టివిని పూర్తిగా వదిలేసాడు. ఈటీవీలో తనకి లైఫ్ నిచ్చిన జబర్దస్త్ ని వదిలేసి, తనకి క్రేజ్ తెచ్చిన ఢీ షో ని వదిలేసి, శ్రీదేవి డ్రామా కంపెనీకి బై బై చెప్పిన సుడిగాలి సుధీర్ స్టార్ మా, జీ ఛానల్స్ లో తేలుతున్న విషయం తెలిసిందే. ఈటీవీలో పని చేస్తే వేరే ఛానల్ కి వెళ్లకూడదని అనే రూల్ ని అత్రిక్రమించలేకనే సుధీర్ ఈటీవిని శాశ్వతముగా వదిలేసాడు అనే టాక్ ఉంది. అలా స్టార్ మా, జీ ఛానల్ ప్రోగ్రామ్స్ లో మేల్ యాంకర్ గా బాగా బిజీగా కనిపిస్తున్నాడు. అయితే స్టార్ మా లో Party లేదా పుష్ప అనే ప్రోగ్రాం చేసారు.
ఆ ప్రోగ్రాం కి సుధీర్ యాంకర్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ స్టేజ్ పై జబర్దస్త్ పాత గ్యాంగ్ అంటే.. ధనరాజ్, ఆర్పీ, అదిరే అభిలాంటి వాళ్ళు ఉండగా.. సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాగబాబు స్పెషల్ గెస్ట్ గా స్టేజ్ పైకి రాగానే సుధీర్ వినయంగా వెల్ కం సర్ అనగానే.. నాగబాబు కొద్దిగా షాకయ్యి.. ఎవరు ఎవరికి వెల్ కామ్ చెబుతున్నారురా అంటూ సెటైర్ వేశారు. అంటే నాగబాబు ఎప్పుడో ఈటీవిని వదిలి స్టార్ మా కి రాగా.. సుధీర్ ఇప్పుడే వచ్చాడు, అతనికి వెల్ కం చెప్పాలి అని నాగబాబు గారి ఉద్దేశ్యం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటి అంతే అనసూయ కూడా వన్ అఫ్ ద గెస్ట్ గా రావడం.. ఈ Party లేదా పుష్ప ప్రోగ్రాంలో కమెడియన్స్ స్కిట్స్, సింగర్స్ పాటలు, డాన్సర్స్ డాన్స్ లు, అనసూయ స్పెషల్ డాన్స్ అబ్బో మాములుగా లేదులే ఈ ప్రోగ్రాం.