Advertisementt

వెకేషన్స్ ని ముగించేసిన మహేష్

Wed 29th Jun 2022 03:24 PM
mahesh,vacation,europe,usa,hyderabad,bahesh babu,namratha,goutham,sitara  వెకేషన్స్ ని ముగించేసిన మహేష్
Mahesh Babu lands in Hyderabad వెకేషన్స్ ని ముగించేసిన మహేష్
Advertisement
Ads by CJ

గత నెలన్నర రోజులుగా మహేష్ బాబు హైదరాబాద్ ని వదిలి యూరప్ కంట్రీస్, అమెరికా అంటూ ఫ్యామిలీతో కలిసి తెగ తిరిగేస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు మహేష్ కానీ, నమ్రత కానీ వారు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేవారు. అయితే ఈ రోజు ఉదయం మహేష్ బాబు ప్రపంచంలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్, మైక్రో సాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్  గేట్స్ ని కలిశారు. అందరూ మహేష్ బాబు తో ఫొటోస్ దిగేందుకు పోటీ పడితే.. మహేష్ మాత్రం తనకి ఎంతో ఇష్టమైన బిల్ గేట్స్ తో ఫోటో దిగారు. 

అదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మిస్టర్ బిల్‌గేట్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది! ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు... ఇంకా అత్యంత వినయం! నిజంగా స్ఫూర్తి! అంటూ మహేష్ బిల్ గేట్స్ తో దిగిన పిక్ ని సోషల్ మీడియా లో షేర్ చేసారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్స్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ లో ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది. నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి మహేష్ బాబు లాంగ్ వెకేషన్స్ ట్రిప్ వేసి యూరప్ కంట్రీస్ తో పాటుగా అమెరికాని చుట్టేశారు. ఇకపై మహేష్ బాబు త్రివిక్రమ్ తో చెయ్యబోయే మూవీ కోసం రెడీ అవ్వనున్నారు అని తెలుస్తుంది.

Mahesh Babu lands in Hyderabad:

Mahesh finishes off his vacation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ