ఏప్రిల్ 14 న పెళ్లి చేసుకుని జూన్ 27 న తల్లితండ్రులు కాబోతున్నట్లుగా ప్రకటించిన అలియా భట్-రణబీర్ కపూర్ లు ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ శుభవార్తని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అలియా భట్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరితో పంచుకుంది ఈ జంట. అలియా భట్ పోస్ట్ చూసిన ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అలియా భట్ ఇలా ప్రెగ్నెంట్ అవ్వగానే ఆమె కెరీర్ పై రకరకాల న్యూస్ లు మొదలైపోయాయి. ఆమె ఇకపై సినిమాల్లో నటించదు అని, ఆమె చేస్తున్న సినిమాలు అలియా భట్ ప్రెగ్నెన్సీ వలన ఆలస్యమవుతాయి అంటూ ఏవేవో రాతలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఆ వార్తలను చూసి కోపం తెచ్చుకున్న అలియా భట్ వెటకారంగా ట్వీట్ చేసింది. మనం 2022 లో ఉన్నాం. ఇప్పటికైనా చెత్త ఆలోచనల నుండి బయట పడితే మంచిది. నా వలన ఏ సినిమాలు ఆలస్యమవడం లేదు. నేను ఒక అమ్మాయిని. పార్సెల్ ని కాదు. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా డాక్టర్స్ చెబితే రెస్ట్ తీసుకుంటాను. అది మీరు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తే.. నేను షూటింగ్‌కి వెళ్లాలి అంటూ అలియా భట్ తన కోపాన్ని ట్వీట్ ద్వారా చూపించింది. ఇక అలియా భట్ ప్రస్తుతం నటించిన బ్రహ్మాస్త్ర రిలీజ్ కి రెడీ అవగా.. పార్ట్ 2 షూటింగ్ దశలో ఉంది. అలాగే ఆమె హాలీవుడ్ ఫిలిం ఒకటి చేస్తుంది. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ తో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా కూడా చేస్తుంది.