Advertisementt

బిగ్ బాస్ లోకి కోరుకున్న ప్రియుడు

Wed 29th Jun 2022 12:08 PM
vadde naveen,bigg boss show,bigg boss 6,bigg boss telugu  బిగ్ బాస్ లోకి కోరుకున్న ప్రియుడు
Vadde Naveen in Bigg Boss 6 telugu బిగ్ బాస్ లోకి కోరుకున్న ప్రియుడు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలు కావడానికి టైం దగ్గర పడుతుండడంతో సీజన్ 6 హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ పై అప్పుడే అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అందులోను ఈసారి సామాన్యులకి చోటు అనేసరికి ఆ ఆసక్తి మరింతగా పెరిగింది. ఆగష్టు కానీ, సెప్టెంబర్ లో కానీ మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ వీరే అంటూ చాలా పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో ఇప్పుడు తాజాగా టాలీవుడ్ కోరుకున్న ప్రియుడు అదేనండి వడ్డే నవీన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కనబడిన నవీన్ తర్వాత సినిమాలకు దూరమయ్యారు.

సినిమాల్లోనే కాకుండా నవీన్ ఆ తర్వాత ఏ ఈవెంట్‌లో కూడా కనిపించడం లేదు. వాళ్ళ పిల్లల దోతీ ఫంక్షన్ అప్పుడే చాలామంది నవీన్ ని చూసి ఉంటారు. అయితే వడ్డే నవీన్ కి బిగ్ బాస్ సీజన్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ ఉన్న నవీన్ ని బుల్లితెర మీద చూస్తే ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారని, ఆయనకి భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ షోలో పాల్గొనడానికి మొదట్లో నవీన్ ఒప్పుకోలేదు అని.. దీంతో భారీ రెమ్యునరేషన్‌ని ఆఫర్‌ చేసి ఆయనను ఒప్పించారని అంటున్నారు. ఇందులో నిజమెంతుంతో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలే వరకు వాటి చెయ్యాల్సిందే. 

Vadde Naveen in Bigg Boss 6 telugu:

Vadde Naveen will be enter the Bigg Boss show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ