Advertisementt

షాకింగ్: హీరోయిన్ మీనా భర్త మృతి

Wed 29th Jun 2022 10:11 AM
meena,meena husband vidyasagar,lungs infection  షాకింగ్: హీరోయిన్ మీనా భర్త మృతి
Meena husband Vidyasagar passes away షాకింగ్: హీరోయిన్ మీనా భర్త మృతి
Advertisement
Ads by CJ

అలనాటి మేటి హీరోయిన్ మీనా భర్త హఠాన్మరణం అందరిని తీవ్ర విషాదానికి గురి చేసింది. మీనా భర్త విద్యాసాగర్‌ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. విద్యాసాగర్ లంగ్స్‌ ఫెయిల్ అవ్వడం వల్లే చనిపోయినట్లుగా డాక్టర్స్ నిర్ధారించారు. జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా అందరూ కరోనా నుండి కోలుకున్నారు. అప్పటినుండి విద్యాసాగర్ ఊపిరిత్తితులు చెడిపోవడం ప్రారంభించాయని,  కొన్ని వారాల క్రితం విద్యాసాగర్ ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని డాక్టర్స్ మీనా ఫ్యామిలీకి చెప్పినట్లుగా తెలుస్తుంది.

అయితే ఊపిరితిత్తుల మార్పుడికి డోనర్ కావాలి, ఒకవేళ డోనర్ దొరికినా.. చాలామంది పేషేంట్స్ ఇలా ఊపిరితిత్తుల మార్పిడికి అప్లై చేసుకుని ఉంటారు. అలా విద్య సాగర్ కన్నా ముందే చాలామంది వెయిటింగ్ లో ఉండడంతో.. ఆయన పరిస్థితి విషమించి మరణించారని, అసలు విద్యాసాగర్ మృతికి కారణం పావురాల విసర్జనల వల్ల కలుషితమైన గాలి పీల్చడంతో గతంలోనే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. విద్యాసాగర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

Meena husband Vidyasagar passes away:

Meena husband Vidyasagar died due to lungs infection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ