రామ్ చరణ్ కి బాలీవుడ్ లో చాలామందే స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి మెగా ఫ్యామిలీతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈమధ్యన సల్మాన్ ఖాన్ హైదరాబాద్ కి ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. తరచూ ఆయన చిరు ఇంట్లో కనిపించారు. ఒకసారి కమల్ పార్టీ, రెండోసారి ఉపాసన - రామ్ చరణ్ పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో సల్మాన్ ఖాన్ తో పాటుగా వెంకటేష్, పూజ హెగ్డే కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఇంటికి మరో స్పెషల్ బాలీవుడ్ హీరో రావడం చూస్తే రామ్ చరణ్ బాలీవుడ్ స్నేహాలను పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.
ఆయనే ఆమిర్ ఖాన్. ఆమిర్ ఖాన్ రామ్ చరణ్ - ఉపాసనతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్ ఆహ్వానం మేరకు ఆమిర్ వారి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి ట్రిపుల్ ఆర్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఇప్పుడు ఈ హీరోల స్నేహాలు అక్కడ సినిమాలు చేసి నిలదొక్కుకోవడానికి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్నటివరకు సల్మాన్ ఖాన్ ఒక్కరి అండ మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు అమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. చరణ్ - ఉపాసనతో ఆమిర్ ఉన్న పిక్ ని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగానే వైరల్ గా మారింది.