రామ్ చరణ్ గత వారం సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందనే. అది కూడా హైదరాబాద్ లోనే జరగడంతో రామ్ చరణ్ ఇక్కడే ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక తన కొత్త చిత్రం RC15 కొత్త షెడ్యూల్ కి రామ్ చరణ్ రెడీ అయ్యారు. గత నెలలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో RC15 భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్ మరియు రామ్ చరణ్ లు లాంగ్ బ్రేక్ తో మరో షెడ్యూల్ కోసం అమృతసర్ వెళ్ళబోతున్నారు. RC15 కి సంబందించిన ఓ షెడ్యూల్ ఇప్పటికే ఒకసారి అమృతసర్ లోని ఓ కాలేజ్ లో జరిగింది. మరోసారి రామ్ చరణ్ - శంకర్ లు అక్కడికే వెళ్ళబోతున్నారు.
జూలై 1 నుంచి అమృతసర్‌లో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఐదు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది అని, రామ్ చరణ్, కియారా అద్వాని తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తుంది. కియారా అద్వానీ కూడా బాలీవుడ్ తన సినిమాల ప్రమోషన్స్ ని ముగించేసి RC15 షూటింగ్ కి రెడీ అయ్యింది. ఇక అమృతసర్ షెడ్యూల్ అవ్వగానే RC15 టీం మళ్ళీ హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీకి వచ్చి ఇక్కడ ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఫిలిం సిటీలో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి శంకర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. ఇక ఈ సినిమాకి అధికారి అనే టైటిల్ ప్రచారంలో ఉంది.