Advertisementt

ఊ అంటావా.. సాంగ్ ని హమ్ చేసిన సల్మాన్

Mon 27th Jun 2022 03:29 PM
salman khan,pushpa song oo antava,samantha ruth prabhu reacts  ఊ అంటావా.. సాంగ్ ని హమ్ చేసిన సల్మాన్
Salman Khan says Pushpa song Oo Antava inspired him ఊ అంటావా.. సాంగ్ ని హమ్ చేసిన సల్మాన్
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా సమంత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా సల్మాన్ ఖాన్ తో చేసే సినిమాతోనే సమంత హిందీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. అందుకే మకాం ముంబై కి మారుస్తుంది అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. సల్మాన్ ఖాన్ చెయ్యబోయే ఓ సీక్వెల్ లో సమంత నే హీరోయిన్ గా అనుకుంటున్నారని అంటున్నారు. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా సాంగ్ నచ్చింది అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్యన బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ ని మిమ్మల్ని ఎంతగానో ఇన్‌స్పైర్‌ చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా.. అని అడగగా.. దానికి సల్మాన్ ఖాన్ ఊ అంటావా మావా అంటూ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ని హమ్‌ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసారు. సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన సమంత హార్ట్‌ ఎమోజీస్‌తో సల్మాన్ ఖాన్ కి థాంక్స్ చెప్పింది. మరి ఇదంతా చూస్తే సల్మాన్ ఖాన్ - సమంత కలిసి సినిమా చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నెటిజెన్స్. 

Salman Khan says Pushpa song Oo Antava inspired him:

Salman Khan says Pushpa song Oo Antava inspired him, Samantha Ruth Prabhu reacts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ