ఈమధ్యన ముంబై లో ఓం రౌత్ ఇచ్చిన పార్టీకి వెళుతూ కెమెరాలకు చిక్కిన ప్రభాస్ చాలా స్లిమ్ గా హ్యాండ్ సమ్ లుక్ లో కనబడి ఫాన్స్ ని మెస్మరైజ్ చెయ్యడమే కాదు, ఆయనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు. రాధే శ్యామ్, సాహో చిత్రాలతో లుక్ విషయంలో తీవ్ర విమర్శలపాలైన ప్రభాస్ ఏప్రిల్, మే లలో తన బరువుని తగ్గించేసి స్లిమ్ గా దర్శనమివ్వడంతో ఆయన ఫాన్స్ సంతోషపడ్డారు. అయితే తాజాగా ప్రాజెక్ట్ కె సెట్స్ నుండి ప్రభాస్ లుక్ ఒకటి బయటికి వచ్చింది.
అంతేకాకుండా నాని, దుల్కర్ సల్మాన్, అమితాబచ్చన్, నాగ్ అశ్విన్ ఇంకా కె రాఘవేంద్రరావు, ప్రశాంత్ నీల్ లతో ప్రభాస్ సరదాగా దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ లుక్ లో ప్రభాస్ ఎప్పటిలాగే తల కి క్లాత్ పెట్టుకుని కాస్త లావుగా కనిపించారు. అయితే ప్రభాస్ వేసుకున్న డ్రెస్ వలన ఆయన కొద్దిగా బరువు గా కనిపిస్తున్నారు కానీ, ఆయన మాత్రం బరువు తగ్గి స్టైలిష్ గానే తయారైనట్లుగా ఓం రౌత్ పార్టీ లుక్ చెబుతుంది. ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్ బాగా గెడ్డం పెంచేసి కొత్తగా కనిపిస్తున్నారు. ఇంకా ఈ పిక్ లో ప్రశాంత్ నీల్, నాని, దుల్కర్ లు స్పెషల్ గా మెరిశారు.