బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ మెగా ఫ్యామిలీ కి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి 60 వ పుట్టిన రోజు వేడుకలకి అప్పట్లోనే స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సల్మాన్ రామ్ చరణ్ తోనూ మంచి ఫ్రెండ్ షిప్ ని మెయింటింగ్ చేస్తుంటారు. ఆ అనుబంధంతోనే సింగిల్ పైసా తీసుకోకుండా సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ చేసారు, దానికి సంబందించిన షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసారు.
అయితే సల్మాన్ ఖాన్-వెంకటేష్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండడంతో సల్మాన్ ఖాన్ తరచూ చిరు ఇంటికి గెస్ట్ గా వెళుతున్నారు. మొన్నామధ్యన కమల్ హాసన్ కి పార్టీ ఇచ్చినప్పుడు సల్మాన్ గెస్ట్ గా చిరు ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆయన భార్య సల్మాన్ మరియు వెంకటేష్ తో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కి కూడా సర్ ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్ ఇంట్లోనే వీరికి చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పైన పిక్ చూస్తే తెలుస్తుంది. ఉపాసన చేతిలో రామ్ చరణ్ పెంపుడు పెట్ రైమా కూడా ఉంది. ఈ పిక్ చూసాక సల్మాన్ ఖాన్ తో మెగా అనుబంధం మరింతగా పెరిగినట్టుగా కనిపిస్తుంది.