Advertisementt

నయనతార హనీమూన్ ఖర్చు ఎంతంటే..

Sun 26th Jun 2022 06:51 PM
nayanthara,vignesh shivan,honeymoon,bankok  నయనతార హనీమూన్ ఖర్చు ఎంతంటే..
Nayanthara - Vignesh Shivan if you know the cost of Honeymoon నయనతార హనీమూన్ ఖర్చు ఎంతంటే..
Advertisement
Ads by CJ

నయనతార తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ని ఈమధ్యనే అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఆ వివాహం హక్కులని కూడా ఈ జంట నెట్ ఫ్లిక్స్ సంస్థకి కోట్లాదిరూపాయలకి విక్రయించారనే టాక్ ఉంది. అలాగే నయనతార నగలు దగ్గరనుండి, ఆమె కట్టుకున్న చీర వరకు ఎంత కాస్ట్లీ ఓ కూడా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు నడిచాయి. అయితే ఇప్పుడు ఈ జంట హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. అక్కడ ఓ రిసార్ట్స్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్ తన అకౌంట్ నుండి షేర్ చేస్తున్నాడు. నయనతార హనీమూన్ లో భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఎంజాయ్ చెయ్యడమే కాదు, ఆమె ఎంత మోడరన్ దుస్తులు ధరించినా మెడలో తాళి ఎక్సపోజ్ అయ్యేలా చూసుకుంటుంది. అంతగా సంప్రదాయానికి విలవనిస్తున్న నయనతార హనీమూన్ ఖర్చు పై ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

నయన్ - విగ్నేష్ శివన్ జంట హనీమూన్ ఖర్చు ఎంతై ఉంటుందా అనే ఆరా మొదలైంది. అయితే బ్యాంకాక్ లోని సియామీ హోటల్ వాళ్లు నయనతార జంటకి ఫ్రీగా అకామిడేషన్ ఏర్పాటు చేసిందట. సోషల్ మీడియాలో తారలకున్న ఫాలోయింగ్ ని బట్టి ఇలాంటి హోటల్స్ తమ పబ్లిసిటీ కోసం ఆయా స్టార్స్ కి ఫ్రీగానే అకామిడేషన్ ఏర్పాటు చేస్తుంటారు. గతంలో కాజల్ అగర్వాల్ తన భర్త కిచ్లు తో కలిసి మాల్దీవుల కి హనీమూన్ కి వెళ్లగా అప్పుడు ఆమె ఖర్చు కోట్లలో చెప్పినా.. అక్కడ హోటల్స్ వారు కాజల్ కి ఫ్రీగానే హనీమూన్ ట్రిప్ ముగించేశారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని బట్టి తారలకు ఇలాంటి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. 

Nayanthara - Vignesh Shivan if you know the cost of Honeymoon:

 Nayanthara - Vignesh Shivan Honeymoon photos viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ