Advertisementt

విదేశాల బాటపట్టనున్న పుష్ప యూనిట్

Sun 26th Jun 2022 10:07 AM
pushpa 2,pushpa 2 update,allu arjun,sukumar  విదేశాల బాటపట్టనున్న పుష్ప యూనిట్
Pushpa 2 shooting update విదేశాల బాటపట్టనున్న పుష్ప యూనిట్
Advertisement
Ads by CJ

పుష్ప సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ - అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ కి సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా పుష్పని తీర్చిదిద్దారు. అందుకే దానికి పార్ట్ 2 గా రాబోతున్న పుష్ప ద రూల్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కాబట్టే పుష్ప కి పెట్టిన బడ్జెట్ కి డబుల్ బడ్జెట్ పుష్ప 2 కి పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ముందుగా కేరళ అడవుల్లో, నల్లమల అడవుల్లో పుష్ప షూటింగ్ అనుకుంటే కోవిడ్ కారణంగా పుష్ప షూటింగ్ మొత్తం మారేడుమిల్లి - రంపచోడవరం ఫారెస్టులో చిత్రీకరించాల్సి వచ్చింది.

అలాగే పుష్ప టైం లో విదేశాల షూటింగ్ ని స్కిప్ చెయ్యాల్సి వచ్చింది. కానీ పుష్ప 2 విషయంలో సుకుమార్ కానీ, అల్లు అర్జున్ కానీ తగ్గేదెలా అంటున్నారట. పుష్ప 2 లోని కొన్ని కీలక సన్నివేశాలను ఇండొనేషియా, సింగపూర్లలో షూట్ చెయ్యాలని అంటుకుంటున్నారట. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించే సన్నివేశాలు పుష్ప ద రూల్ కి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నెలాఖరు నుండి కానీ, ఆగష్టు మొదటి వారం నుండి కానీ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Pushpa 2 shooting update:

Pushpa The Rule shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ