Advertisementt

జబర్దస్త్ కి మళ్లీ పిలిచినా వెళ్ళను

Sat 25th Jun 2022 05:17 PM
jabardasth,appa rao,jabardasth appa rao interview  జబర్దస్త్ కి మళ్లీ పిలిచినా వెళ్ళను
Jabardasth Appa Rao Interview జబర్దస్త్ కి మళ్లీ పిలిచినా వెళ్ళను
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లోకి కమెడియన్స్ గా అడుగుపెట్టి అక్కడ తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ తెచ్చుకుజున్నాక ఇల్లు కట్టుకుని మల్లెమాలని పొగిడేసే జబర్దస్త్ వాళ్ళు తర్వాత వేరే అవకాశాల కోసం బయటికి వెళ్లినా, కాదు మల్లెమాల మీద కోపంతో బయటికి వెళ్లినా, లేదూ జబర్దస్త్ వదిలేసి.. వేరే ఛానళ్ల కి వెళ్లిన వారు మొదట్లో తమకి జబర్దస్త్ అన్నం పెట్టింది అని చెబుతూనే చివరికి జబర్దస్త్ మీద విషం కక్కేవాళ్ళు ఉన్నారు.. కొంతమంది మాత్రం జబర్దస్త్ మాకు అన్నీ ఇచ్చింది అని చెప్పేవారు ఉన్నారు. తనకి లాక్ డౌన్ లో సహాయం చెయ్యలేదని అన్నం పెట్టిన జబర్దస్త్ నుండి బయటికి వచ్చి స్టార్ మా సెటిల్ అయిన అవినాష్. కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని తిడుతూనే ఉంటారు. 

ఇక ఈ ఈమధ్యన ఆసం అప్పి జబర్దస్త్ నుండి బయటికి రావడం, తర్వాత స్టార్ మా లో కామెడీ స్టార్స్ చెయ్యడంతో ఆసం అప్పి ని యూట్యూబ్ ఛానల్స్ తెగ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూ లో మొదట్లో ఆసం అప్పి జబర్దస్త్ ని, భాస్కర్ ని ఏమి అనకపోయినా.. ఈమధ్యన ఆయన, ఆయన భార్య బుల్లెట్ భాస్కర్ తమని పక్కనబెట్టిన కారణంగానే తాము జబర్దస్త్ వదిలేశామని చెప్పారు. భాస్కర్ వల్లే బయటకి వచ్చేసినట్లుగా. తాజాగా భాస్కర్ ఇక్కడ నేను ఓనర్ కాదు, యాజమాన్యం ఎలా చెబితే అలానే అంటూ అప్పి విషయంలో ఓపెన్ అయ్యాడు.

తాజాగా ఆసం అప్పిని మిమ్మల్ని జబర్దస్త్ లోకి పిలిస్తే మళ్లీ వెళతారా అని అడిగితె వెళ్ళను అనేశాడు. అక్కడ అవమానం అనిపించాక మళ్ళి అడుగుపెట్టను. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో చేస్తున్నా. ప్రేక్షకులు ఎవరైనా కొత్తదనమే కోరుకుంటారని తేల్చేసాడు అప్పారావు.

Jabardasth Appa Rao Interview:

Jabardasth Appa Rao Exclusive Full Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ