లక్కీ హీరోయిన్ గా వరస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన రష్మిక మందన్న ఆ భాషా లేదు, ఈ భాషా లేదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మిగతా హీరోయిన్స్ కి దడ పుట్టిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకోవడంతో రష్మిక రేంజ్ పెరిగిపోయింది. అయితే అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ పై రూమర్స్ కూడా తక్కువేం లేవు. గతంలో పారితోషకం విషయంలో రష్మిక డిమాండ్ అనే న్యూస్ చూసిన ఆమె.. అవును క్రేజ్ ఉన్నప్పుడే పెంచుతాం, పని చేస్తాం అడుగుతాం అందులో తప్పేముంది అని చెప్పింది.
తాజాగా రష్మిక డిమాండ్ కి నిర్మాతలు బేజార్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. రష్మిక ఆ సినిమా షూటింగ్.. ఈ సినిమా షూటింగ్ అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడం అన్నట్టుగా ఉంటుంది. తనకి వేసే ఫ్లైట్ టికెట్ తో పాటుగా, తన పెంపుడు కుక్క ఆరా కి కూడా టికెట్ బుక్ చెయ్యమని గొంతెమ్మ కోర్కెలు నిర్మాతలను కోరుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ కి రష్మిక స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారలో అర్థం కాదు. ఆరా(రష్మిక పెంపుడు కుక్క) నాతో కలిసి పయణించాలని మీకు ఉన్నా... తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అసలు ఇష్టం ఉండదు. తను హైదరాబాద్‌లోనే హ్యాపీ ఉంటుంది.. అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు, క్షమించండి నవ్వు ఆపుకోలేకపోతున్నా అంటూ మరో ట్వీట్ చేసింది రష్మిక.