Advertisementt

మోడ్రెన్ లోనూ ట్రెడిషన్ చూపించింది

Fri 24th Jun 2022 07:40 PM
nayanthara,vignesh shivan,nayanthara-vignesh shivan,honeymoon,thailand  మోడ్రెన్ లోనూ ట్రెడిషన్ చూపించింది
Vignesh Shivan, Nayanthara honeymoon in Thailand మోడ్రెన్ లోనూ ట్రెడిషన్ చూపించింది
Advertisement
Ads by CJ

నయనతార ఈమధ్యనే ప్రియుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని సంసారం జీవితంలోకి అడుగుపెట్టింది. నయనతార హిందూ సంప్రదాయంలోనే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు సారీ తోనూ, మెడలో మంగళ సూత్రంతో కనిపించిన నయనతార మీడియా తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చక్కటి చీర జాకెట్టులో మెడలో తాళితోనే కనిపించింది. ఇక నయన్ - విగ్నేష్ జంట థాయిలాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థాయిలాండ్ నుండి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో నయనతార మోడ్రెన్ దుస్తుల్లోనే కనిపిస్తుంది. 

హీరోయిన్ గా గ్లామర్ గా కనిపించే నయనతార పెళ్లి తర్వాత ట్రెడిషనల్ గా కనిపించినా హనీమూన్ లో మాత్రం మోడ్రెన్ గా, గ్లామర్ గా కనబడుతుంది. విగ్నేష్ క్యాజువల్ వెర్ లో కనిపిస్తుంటే నయనతార స్లీవ్ లెస్ టాప్స్, స్లీవ్ లెస్ ఫ్రాక్స్ లో మోడ్రెన్ గా కనిపిస్తుంది. అంత మోడ్రెన్ డ్రెస్సులతో నయనతార మేడలో తాళి ని స్పష్టంగా చూపిస్తుంది. భర్త తో ఎంత రొమాంటిక్ గా, గ్లామర్ గా వున్నా నయనతార మాత్రం సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది అంటూ ఆమె ఫాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.

Vignesh Shivan, Nayanthara honeymoon in Thailand:

Nayanthara-Vignesh Shivan Dreamy Honeymoon Pics viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ