Advertisementt

థ్యాంక్యూ రిలీజ్ డేట్ చేంజ్

Fri 24th Jun 2022 05:12 PM
thank you,thank you the movie,naga chaitanya,raashi khanna  థ్యాంక్యూ రిలీజ్ డేట్ చేంజ్
Thank You The Movie is now hitting the screens on July 22nd థ్యాంక్యూ రిలీజ్ డేట్ చేంజ్
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా థ్యాంక్యూ. మనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా, రెండు పాటలు మారో.., ఏంటో ఏంటేంటో... చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 

టీజర్ తో పాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో థ్యాంక్యూ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా థ్యాంక్యూ సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు. అన్ని కమర్షియల్ హంగులతో థ్యాంక్యూ సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. నాగ చైతన్య కెరీర్ లో థ్యాంక్యూ ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.

Thank You The Movie is now hitting the screens on July 22nd:

Naga Chaitanya Thank You The Movie is now hitting the screens on July 22nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ