Advertisementt

ముంబైలో లైగర్ సాంగ్ షూట్?

Fri 24th Jun 2022 02:26 PM
liger,liger song shoot,mumbai,vijay devarakonda,puri jagannadh,ananya panday  ముంబైలో లైగర్ సాంగ్ షూట్?
Liger song shoot in Mumbai? ముంబైలో లైగర్ సాంగ్ షూట్?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలిసి లైగర్ షూటింగ్ కి ఈ మార్చి లోనే ప్యాకప్ చెప్పేసి.. JGM ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసారు. రీసెంట్ గానే JGM రెగ్యులర్ షూట్ కి వెళ్లారు. అయితే లైగర్ షూటింగ్ ఫినిష్ అయ్యింది, మరో వారం రోజుల్లో లైగర్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఆగష్టు లో రిలీజ్ కాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ ని ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టి సినిమా రిలీజ్ టైం కి పరుగులు పెట్టించాలని విజయ్ అండ్ పూరి ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఐదు భాషల్లో తెరకెక్కిన లైగర్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న లైగర్ మూవీ పై ఓ న్యూస్ ఇంట్రెస్ట్ ని కాదు అనుసమానాలని క్రియేట్ చేస్తుంది. అది ముంబై లో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారని. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ అయిన లైగర్ కి మళ్ళీ సాంగ్ షూట్ ఏమిటి? అనే అనుమానం మొదలైంది. ముంబైలో వేసిన ప్రత్యేకమైన ఇండోర్ సెట్‌లో విజయ్ దేవరకొండ-అనన్య పాండే మధ్యన ఓ అదిరిపోయే రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందా? లేదంటే ప్రమోషనల్ సాంగా అనేది తెలియాల్సి ఉంది. ఈ సాంగ్ షూట్ మరో రెండు రోజుల్లో కంప్లీట్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది.

Liger song shoot in Mumbai?:

Vijay Deverakonda Liger Movie Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ