బాలకృష్ణ ఓ టాక్ షో చెయ్యడం అది బంపర్ హిట్ అవడం అంతా ఓ కలలా జరిగిపోయింది. బాలయ్య టాక్ షో ఏమిటి అన్నవాళ్ళకి బాలకృష్ణాలోని మరోకోణాన్ని పరిచయం చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో. ఈ షో లో స్టార్ సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాలు, మహేష్ బాబు లాంటి హీరోలోని మరో కోణం అన్ని బయటపెట్టడం కన్నా బాలకృష్ణ హోస్టింగ్ కి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. అందుకే అన్ స్టాపబుల్ టాక్ షో కి విపరీతమైన క్రేజ్, హైప్ పెరిగింది. ఇప్పుడు రాబోయే సెకండ్ సీజన్ కోసం ఆ అంచనాలు మరింతగా పెరిపోయి.. బాలయ్య మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆహా అన్ స్టాపబుల్ తో ఆడియన్స్ ముందుకు వస్తారో అంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
త్వరలోనే అన్ స్టాపబుల్ 2 అంటూ ఆహా ఓటిటి ఎప్పుడో ప్రకటించగా.. ఈసారి ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరుతో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సీజన్లో కి బాలయ్య రేటు పెంచారనే టాక్ మొదలైంది. అన్ స్టాపబుల్ సీజన్ 1 మొత్తం 10 ఎపిసోడ్లతో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యింది. దీనికి బాలయ్య పారితోషికం కేవలం జస్ట్ 1 కోటి మాత్రమే అని అంటున్నారు. కానీ ఇప్పుడు సీజన్లో 2 కి ఒక్కో ఎపిసోడ్ కి బాలకృష్ణ 25 లక్షలు పారితోషకం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సీజన్ లో కూడా 10 నుండి 12 ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉంది అని, ఈసెకండ్ సీజన్ కి అయినా బాలయ్య షో కి ఎన్టీఆర్ వస్తాడని నందమూరి ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.