Advertisementt

Mega154 రిలీజ్ డేట్ ఫిక్స్

Fri 24th Jun 2022 11:56 AM
mega154,cinemas,sankranthi 2023,chiranjeevi,bobby,god father,bhola shanker  Mega154 రిలీజ్ డేట్ ఫిక్స్
Mega154 Grand Worldwide Releasing on.. Mega154 రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ వరస ప్రాజెక్ట్స్ తో ఎంత బిజీగా ఉంటున్నారో ఆయన లైనప్ చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, Mega154 షూటింగ్స్ చేస్తూ యంగ్ హీరోస్ కి గట్టిపోటి ఇస్తున్నారు. అయితే చిరంజీవి - మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ ఆగష్టు కానీ, సెప్టెంబర్ లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా మెగాస్టార్ రీసెంట్ గా రివీల్ చేసారు. ఇప్పుడు భోళా శంకర్ మాట ఎలా వున్నా Mega154  తో బాబీ చాలా తొందరపడుతున్నారు.

మెగా అభిమానులకు మెగా అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. 2023 సంక్రాంతికి మెగా154 థియేటర్ లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023, అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్ గా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలో వెల్లడించనున్నారు.

మెగా154 ప్రస్తుతం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది, గడువులోగా పూర్తి చేయడానికి నాన్‌స్టాప్‌గా షూట్ చేయనున్నారు. మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్-ప్యాక్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

Mega154 Grand Worldwide Releasing on..:

Mega154 Grand Worldwide Release in Cinemas this Sankranthi 2023 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ