సామాన్యులు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకుంటే పెద్దగా సెన్సేషన్ ఏం అవ్వదు. అదే సెలబ్రిటీస్ రెండో పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా మీడియాలో పెద్ద సంచలనం అయ్యి కూర్చుంటుంది. తాజాగా సీనియర్ నరేష్ నాలుగో పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అదలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ సింగర్ ఇద్దరు విడాకులకు అప్లై చేయబోతున్నారనే న్యూస్ వారి ఫాన్స్ కి షాకిస్తుంది. సింగర్ హేమ చంద్ర ఆయన భార్య సింగర్ శ్రావణ భార్గవి విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగానే జరుగుతుంది.
హేమచంద్ర - శ్రావణ భార్గవి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఓ పాప కూడా పుట్టింది. అంత అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట పై విడాకుల రూమర్స్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఇప్పటికే హేమచంద్ర - శ్రావణ భార్గవిలు విడివిడిగా ఉంటున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. హేమచంద్రకి శ్రావణ భార్గవికి మధ్యలో విభేదాలు రావడం, వాటిని పెద్దలు కూడా పరిష్కరించలేకపోవడంతోనే ఈ జంట విడాకులు కోసం కోర్టు ఎట్లు ఎక్కబోతుంది అంటున్నారు. ఇందులో నిజమెంతుంతో తెలియాలంటే ఖచ్చితంగా హేమ చంద్ర కానీ, శ్రావణ భార్గవి కానీ స్పందించాల్సిందే.