Advertisementt

రేటు పెంచింది అవకాశాలు పోతున్నాయ్

Fri 24th Jun 2022 09:54 AM
kgf chapter 2,srinidhi shetty,yash,prashanth neel  రేటు పెంచింది అవకాశాలు పోతున్నాయ్
Srinidhi Shetty demands huge remuneration రేటు పెంచింది అవకాశాలు పోతున్నాయ్
Advertisement
Ads by CJ

కేజిఎఫ్ తో ప్రపంచానికి కన్నడ సినిమా ఇండస్ట్రీని పరిచయం చెయ్యడం కాదు.. ఆ ఇండస్ట్రీకి మంచి క్రేజ్ తీసుకువచ్చారు ప్రశాంత్ నీల్ అండ్ హీరో యశ్ లు. కన్నడ ఇండస్ట్రీ అంటే ఎక్కడుందో తెలియనివారందరికి కేజిఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీకి గుర్తింపుని తెచ్చారు వారు. ప్రశాంత్ నీల్, యశ్ లు కెజిఎఫ్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. వారికే కాదు ఆ సినిమా లో నటించిన విలన్స్ కి, హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి ఇలా అందరికి మంచి పేరొచ్చింది. హీరో, దర్శకుడు ఇలా ఎవరికి వారే తదుపరి సినిమాలతో బిజీ అవుతుంటే హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. కారణం ఆమె పారితోషకం చూసి దర్శకనిర్మాతలు బెదిరిపోతున్నారట.

కేజిఎఫ్ పాన్ ఇండియా క్రేజ్ తో శ్రీనిధి కి వచ్చిన ఫేమ్ తో ఆమె పారితోషకం అమాంతం పెంచేసింది అని, దానితో ఆమెకి ఆఫర్స్ ఇవ్వడానికి జంకుతున్నారని అంటున్నారు. మరి ఒక పాన్ ఇండియా హిట్ వచ్చిన హీరోయిన్స్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అవడమేమిటి.. నాలుగైదు సినిమాల షూటింగ్స్ తో నానా హడావిడి చేస్తారు. కానీ శ్రీనిధి శెట్టి మాత్రం ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేసిన దాఖలాలు లేవు. ఆమెకి అవకాశాలు వస్తున్నా ఆమె పెంచిన పారితోషకమే ఆమెకి నెక్స్ట్ సినిమా మొదలు కాకపోవడానికి ముఖ్య కారణం అంటున్నారు. 

Srinidhi Shetty demands huge remuneration:

KGF Chapter 2 actress srinidhi shetty demands huge remuneration for her next Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ