Advertisementt

ఫైనల్లీ తరుణ్ భాస్కర్ సినిమా అనౌన్సమెంట్

Thu 23rd Jun 2022 06:50 PM
tharun bhascker dhaassyam,vg sainma,production no 1,keedaa cola movie  ఫైనల్లీ తరుణ్ భాస్కర్ సినిమా అనౌన్సమెంట్
Tharun Bhascker Dhaassyam Production No 1 Titled Keedaa Cola ఫైనల్లీ తరుణ్ భాస్కర్ సినిమా అనౌన్సమెంట్
Advertisement
Ads by CJ

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది అంటూ రెండు డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ని మెప్పించిన తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ దర్శకుడిగా తరుణ్ భాస్కర్ మూడో ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. మధ్యలో సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది అంటూ ప్రచారం జరిగినా తరుణ్ భాస్కర్ ఖాళీగానే కనిపించాడు కానీ.. ఎలాంటి ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. ఫైనల్లీ తరుణ్ భాస్కర్ కొత్త సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు.

తరుణ్ భాస్కర్ కొత్త సినిమాకి కీడా కోలా అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టి ఓ పోస్టర్ తో ఆ టైటిల్ ని రివీల్ చేసారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొందుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే పోస్టర్ లో ఒక పురుగుని కూడా గమనించవచ్చు. మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్సపీరియన్స్ చేయండి.. అని మేకర్స్ వెల్లడించారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి పోస్టర్లు పసుపు రంగులో డిజైన్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ కీడా కోలా పోస్టర్ ని కూడా పసుపు రంగులో డిజైన్ చేయడం విశేషం.

Tharun Bhascker Dhaassyam Production No 1 Titled Keedaa Cola:

Tharun Bhascker Dhaassyam, VG Sainma’s Production No 1 Titled Keedaa Cola

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ