Advertisementt

పెళ్లిపై నరేష్ ఓపెన్ కామెంట్స్

Thu 23rd Jun 2022 09:07 AM
naresh,sr naresh,wedding,naresh 4th wedding  పెళ్లిపై నరేష్ ఓపెన్ కామెంట్స్
Naresh Open Comments on 4th Wedding పెళ్లిపై నరేష్ ఓపెన్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఈమధ్యన సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. నటి పవిత్ర లోకేష్ ని నరేష్ వివాహం చేసుకోబోతున్నాడని, ఇప్పటికే నరేష్ - పవిత్ర లోకేష్ కలిసి ఉంటున్నారని, త్వరలోనే వీళ్ల పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కానీ.. నరేష్ కానీ, పవిత్ర లోకేష్ కానీ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక వీరిద్దరి వివాహం అతి త్వరలోనే అన్నప్పటికీ.. పవిత్ర లోకేష్ తన భర్త నుండి ఇంకా విడాకులు తీసుకుని కారణంగానే నరేష్ - పవిత్రల పెళ్లి లేట్ అవుతూ వస్తుందని, పవిత్ర లోకేష్ తన తో విడాకులకు అప్లై చేసింది అని.. కానీ ఇంకా విడాకులు రాని కారణంగానే వీరి పెళ్లి లేట్ అవుతుంది అని తెలుస్తుంది.

ఇక నరేష్ తాజాగా ఆయన పెళ్లిపై ఓపెన్ కామెంట్స్ చేసారు. ఏ సినిమా వాళ్లే పెళ్లిళ్లు చేసుకుంటున్నారా.. మిగతా వాళ్లు ఎవ్వరూ పెళ్లిళ్లు చేసుకోవడం లేదా.. అంటూ నరేష్ నాలుగో పెళ్లిపై ఓపెన్ అయ్యారు. పెళ్లి చేసుకోవడం అంటే ఆట కాదు, పెళ్లి అంటే లైఫ్, ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తేనే తప్ప విడాకులు తీసుకుని వేరే పెళ్లి నిర్ణయానికి రారు. సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య సర్ధుపోవడం ఉండాలి, అది లేకపోతే పెళ్లి చేసుకోవడం వేస్ట్.. నా పెళ్లి లైఫ్ సినిమాలపై పడనివ్వను, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సినిమాలే. సినిమాల కోసం నేను ఏమైనా వదులుకోవడానికి సిద్ధం అంటూ నరేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Naresh Open Comments on 4th Wedding:

 Naresh Open Comments On His Fourth Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ