Advertisementt

అక్షయ్ కుమార్ కే షాకిచ్చిన ప్రభాస్?

Wed 22nd Jun 2022 10:24 PM
prabhas,adipurush,baahubali,saaho,bollywood akshay kumar  అక్షయ్ కుమార్ కే షాకిచ్చిన ప్రభాస్?
Prabhas to Become Highest Paid Indian Actor అక్షయ్ కుమార్ కే షాకిచ్చిన ప్రభాస్?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియా వైడ్ గానే కాదు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్న హీరో. బాహుబలి తోనే బాలీవుడ్ హీరోలకి చమటలు పట్టించిన హీరో ఆయన. వరసగా పాన్ ఇండియా ప్రోజెక్ట్స్ మాత్రమే కాదు, భారీ బడ్జెట్ మూవీస్ తో మిగతా హీరోలకి సవాల్ విసురుతున్నాడు. ఆదిపురుష్ లాంటి 3D మూవీ చేస్తున్న ప్రభాస్, సలార్ లాంటి మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే ప్రాజెక్ట్ కె లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న ప్రభాస్.. తర్వాత ప్రాజెక్ట్స్ కూడా లాంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ కావు. అందుకే ప్రభాస్ పారితోషకం కూడా మేకర్స్ అదే లెవల్ కి సెట్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడని అంటుంటే.. ఇప్పుడు ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎవరూ ఊహించని పారితోషకం తీసుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఏకంగా 120 కోట్ల పారితోషకం అడిగినట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ హీరోలలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు ప్రభాస్ అక్షయ్ కుమార్ కే షాక్ ఇచ్చేంత పారితోషకం తీసుకోబోతున్నాడంటున్నారు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ అడిగిన 20 కోట్ల మొత్తం ఇచ్చేందుకు టీ సిరిస్, భూషణ్ కుమార్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ విన్న బాలీవుడ్ స్టార్లు ఖంగు తిన్నట్టు టాక్. 

Prabhas to Become Highest Paid Indian Actor:

Prabhas emerges as the highest-paid actor in India as he charges 120 crore for Adipurush

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ