బిగ్ బాస్ సౌత్ లో మొదలైనప్పటినుండి బుల్లితెర ప్రేక్షకులు ఆ షో ని బాగానే ఆదరిస్తున్నారు. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా బిగ్ బాస్ ఓటిటీని కూడా మొదలు పెట్టేసింది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకునే వారు ఆ షో ద్వారా మంచి రెమ్యునరేషన్ తో పాటుగా, కాస్తో కూస్తో క్రేజ్ కూడా వస్తుంది అని నమ్మే హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. కొంతమందికి ఆ ఫేమ్ రాకపోగా.. ఢీ ఫేమ్ అవుతున్నారు. తెలుగులో గత ఐదు సీజన్స్ నుండి చాలామంది కంటెస్టెంట్స్ ఇలానే హౌస్ లోకి వచ్చి క్రేజ్ పోగొట్టుకుని బయటికి వెళ్లారు. అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లంటే చాలామంది ఆలోచనలో పడుతున్నారు.
కానీ తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అదే ఎం ఎస్ రాజు కొడుకు హీరో సుమంత్ అశ్విన్. హీరోగా ఎదగడానికి కిందా మీదా పడుతున్న సుమంత్ అశ్విన్ రేపు శుక్రవారం 7 డేస్ 6 నైట్స్ సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ హీరో ని బిగ్ బాస్ సీజన్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించినట్టుగా తెలుస్తుంది. సుమంత్ నటించిన తూనీగ తూనీగ, కేరింత, అంతకు ముందు ఆ తర్వాత కాస్తో కూస్తో పర్వాలేదనిపించినా కూడా సుమంత్ కి పేరు రాలేదు. బిగ్ బాస్ లోకి అడుగుపెడితే క్రేజ్ పెరుగుతుంది అనే హోప్స్ తో హౌస్ లోకి వెళ్ళడానికి ఒప్పుకున్నాడేమో అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.