టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్స్ తో, కోలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు. కోలీవుడ్ విజయ్ టాలీవుడ్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తుంటే, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ మరో కోలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విక్రమ్ తో భారీ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ మూవీ కి మంతనాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే చరణ్ - లోకేష్ సీక్రెట్ మీటింగ్ జరిగింది అని కూడా ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయమై ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు, కానీ లోకేష్ కనగరాజ్ తాజాగా రామ్ చరణ్ తో చెయ్యబోయే మూవీ విషయమై స్పందించినట్టుగా తెలుస్తుంది. తాను చరణ్ తో సినిమా చేసే విషయమై మాట్లాడలేదు అని, విక్రమ్ రిలీజ్ కి ముందే ఒకటిరెండు సార్లు చరణ్ ని కలవడం జరిగింది, రామ్ చరణ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పడంతో.. లోకేష్ కనగరాజ్ విషయాన్ని రివీల్ చెయ్యకపోయినా.. రామ్ చరణ్ తో లోకేష్ మూవీ కన్ ఫర్మ్ అని మెగా ఫాన్స్ ఫిక్స్ అయ్యిపోతున్నారు.