Advertisementt

టాక్ ఓకె.. ఆ రెండిటి ప్రాబ్లెమ్ అదే!

Tue 21st Jun 2022 02:08 PM
virata parvam,ante sundaraniki movie,collocations,tlak,nani,rana  టాక్ ఓకె.. ఆ రెండిటి ప్రాబ్లెమ్ అదే!
Talk OK.. Both of those problems are the same! టాక్ ఓకె.. ఆ రెండిటి ప్రాబ్లెమ్ అదే!
Advertisement
Ads by CJ

సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్‌తో పాటుగా క్రిటిక్స్ ఇచ్చే రేటింగ్స్‌ని బట్టి సినిమా హిట్టా లేదంటే ఫట్టా అనే విషయం మార్నింగ్ షో కే తేలిపోతుంది. అలాగే నాని నటించిన అంటే సుందరానికి సినిమా రిలీజ్ అవ్వగానే ప్రేక్షకుల నుండి నాని మరో హిట్ కొట్టాడు అని, క్రిటిక్స్ నుండి సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చేసాయి. అటు నాని కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ యూనిట్ అంతా కలిసి కేక్ కట్ చేసింది. తీరా చూస్తే సినిమాకి కలెక్షన్స్ రావడం లేదు. సెకండ్ వీక్‌లో కూడా అంటే సుందరానికి కలెక్షన్స్ పడిపోయాయి. ఫస్ట్ వీక్ లోనే అంతంతమాత్రంగా ఉన్న అంటే సుందరానికి కలెక్షన్స్ సెకండ్ వీక్‌లో మరింత ఘోరంగా ఉన్నాయి.

ఇక నిన్న శుక్రవారం రిలీజ్ అయిన విరాట పర్వం మూవీ టాక్ కూడా అంతే. సినిమా సూపర్ అన్నారు. సాయి పల్లవి పెరఫార్మెన్స్ అదుర్స్ అన్నారు. క్రిటిక్స్ కూడా పర్వాలేదన్నారు. కానీ ఫస్ట్ డే కే విరాట పర్వం మూవీ కి ఓపెనింగ్స్ రాలేదు. ఓటిటి మూవీ అంటూ తర్వాత రోజు నుండే ఆ సినిమా కలెక్షన్స్ మరింతగా పడిపోయాయి. అటు నాని సినిమా అంతే, ఇటు సాయి పల్లవి సినిమా అంతే. నాని అంటే సుందరానికి, సాయి పల్లవి విరాట పర్వం రెండు సినిమాలూ టాక్ బావున్నా కలెక్షన్స్ మాత్రం అస్సలు బాగోలేదు.

Talk OK.. Both of those problems are the same!:

virata parvam, ante sundaraniki movies collocations week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ