Advertisementt

నయన్-విగ్నేష్ హానీమూన్ ఎక్కడంటే..

Tue 21st Jun 2022 10:20 AM
nayanthara,vignesh shivan,thailand honeymoon,bangkok  నయన్-విగ్నేష్ హానీమూన్ ఎక్కడంటే..
Nayanthara and Vignesh Shivan share romantic moment on Thailand honeymoon నయన్-విగ్నేష్ హానీమూన్ ఎక్కడంటే..
Advertisement
Ads by CJ

నయనతార - విగ్నేష్ శివన్ లు జూన్ 9 న మహాబలిపురంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏడేళ్ల ప్రేమని పెళ్లిగా మార్చుకున్న ఈ జంట తర్వాత రోజే తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కేరళ ఆలయాలు చుట్టేసిన నయన్ దంపతులు ఆమె తల్లి దగ్గరకి వెళ్లారు. అక్కడే కేరళలో రెండు వారాలు నయనతార - విగ్నేష్ శివన్ లు ఉండబోతున్నారని అన్నప్పటికీ.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ మూడ్ లో ఉంది. తమ హనీమూన్ కోసం నయనతార - విగ్నేష్ లు థాయ్ లాండ్, బ్యాంకాక్ ఎంచుకున్నట్టుగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. 

బ్యాంకాక్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఈ జంట సందడి చేస్తుంది. నయనతార సింపుల్ గా ఉండే ఎల్లో కలర్ ఫ్రాక్ వేసుకుని కనిపిస్తూ ఉంటే విగ్నేష్ మాత్రం క్యాజువల్స్ లో కనిపించడమే కాదు, నయనతార నుదిటిమీద ముద్దు పెడుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాంకాక్ లోనే ఈ జంట మరికొద్ది రోజులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. హనీమూన్ ట్రిప్ ముగియగానే నయనతార జంట చెన్నై కి పయనమవుతారని సమాచారం. 

Nayanthara and Vignesh Shivan share romantic moment on Thailand honeymoon:

Vignesh Shivan shares photos from his honeymoon with Nayanthara: In Thailand with my Thaaram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ