Advertisementt

ఐడియాలు రాని రోజు జబర్దస్త్ వదిలేస్తా

Mon 20th Jun 2022 10:16 PM
jabardasth,auto ramprasad,sudheer,srinu,hyper aadi,indraja,ram prasad sensational comments  ఐడియాలు రాని రోజు జబర్దస్త్ వదిలేస్తా
Ram Prasad Sensational comments on Jabardasth ఐడియాలు రాని రోజు జబర్దస్త్ వదిలేస్తా
Advertisement
Ads by CJ

ప్రస్తుతం జబర్దస్త్ నుండి టాలెంటెడ్ కమెడియన్స్, క్రేజీ కమెడియన్స్ దూరమైపోతున్నారు. వరస స్కిట్స్ కొట్టే హైపర్ ఆది ఎప్పుడో జబర్దస్త్ నుండి తప్పుకోగా.. ఆయన టీమ్ మెంబెర్స్ వేరే టీం ని ఫామ్ చేసుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ నుండి వెళ్లిపోగా రామ్ ప్రసాద్ ఒంటరిగా స్టేజ్ పై పోరాడుతున్నాడు. కొంతమందిని టీం గా ఫామ్ చేసుకుని స్కిట్స్ చేస్తున్నా కూడా సుధీర్, శ్రీను లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. వారిద్దరూ లేకపోవడంతో ఒంటరితనం అనిపిస్తుంది అని రామ్ ప్రసాదే చెబుతున్నాడు.

అయితే జబర్దస్త్ కి సుధీర్, శ్రీను రీ ఎంట్రీ ఇస్తారో లేదో తెలియదు కానీ.. రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు 1000 స్కిట్స్ వరకు చేసాం. అందులో సరైన ఐడియాలు రాకపోవడం వల్లే కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. చాలా రకాల స్కిట్స్ చేసాం. అందులో కొన్ని సక్సెస్ అయితే, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఏది గుర్తుకు వస్తే అదే స్కిట్ చెయ్యడం వలన అవి ఫెయిల్ అవుతున్నాయి. ఆ విషయం ఒప్పుకోవడానికి నేనేమి సిగ్గు పడడం లేదు, ఐడియాలు రాని రోజు జబర్దస్త్ వదిలేస్తా. సుధీర్, శ్రీను లేకపోయినా, నా రైటింగ్ మీదున్న నమ్మకంతోనే జబర్దస్త్ లో ఉన్నాను. వాళ్ళు లేకపోవడం లోటు అయినా, నా టాలెంట్ తో దాన్ని అధిగమిస్తాను అంటూ రామ్ ప్రసాద్ జబర్దస్త్ స్టేజ్ పై చెప్పాడు.

Ram Prasad Sensational comments on Jabardasth :

Jabardasth Auto Ramprasad Sensational Comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ