Advertisementt

సల్మాన్ కి రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్

Mon 20th Jun 2022 09:28 PM
ram charan,salman khan,venkatesh,pooja hegde  సల్మాన్ కి రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్
Ram Charan special in Salman Kabhi Eid Kabhi Diwali సల్మాన్ కి రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్ లో కభీ ఈద్ కభీ దివాలీ సినిమా చేస్తున్నారు. సల్మాన్ కభీ ఈద్ కభీ దివాలీ షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లోనే స్టే చేసారు. ఈసినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ ఫ్యామిలీతో సల్మాన్ ఫ్రెండ్ షిప్ ఎప్పటినుండో కంటిన్యూ అవుతుంది. చిరు గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు.

ఇప్పుడు అదే ఫ్రెండ్ షిపిమ్ తో రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ మూవీ కభీ ఈద్ కభీ దివాలీ లో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యబోతున్నారు. ట్రిపుల్ ఆర్ తో హిందీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కోసం సల్మాన్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు చరణ్ సల్మాన్ ఖాన్ కోసం స్పెషల్ సాంగ్ చెయ్యడం తో ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. మంచి మైలేజ్ వస్తుంది. రామ్ చరణ్ - సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఈ మాస్ సాంగ్ లో కనిపిస్తారని, ఈ సాంగ్ సినిమా లో ప్రత్యేకంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని క్రిష్ట్మస్ స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు.  

Ram Charan special in Salman Kabhi Eid Kabhi Diwali:

Ram Charan sensation with Salman Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ