Advertisementt

అడివి శేష్ బ్రేకప్ స్టోరీ

Mon 20th Jun 2022 06:55 PM
adivi sesh,adivi sesh love story,major hit,adivi sesh breakup story  అడివి శేష్ బ్రేకప్ స్టోరీ
Adivi Sesh shared his breakup love story అడివి శేష్ బ్రేకప్ స్టోరీ
Advertisement
Ads by CJ

మేజర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అడివి శేష్ తాజా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టాడు. గూఢచారి, ఎవరు లాంటి సినిమాలతో థ్రిల్లర్ ఆడియన్స్ ని మెప్పిస్తున్న అడివి శేష్ తో సినిమాలు చేస్తే నిర్మాతలు కూల్ అనేలా వ్యవహరిస్తాడు. ఎందుకంటే తానే ప్రొడ్యూస్ చేసినట్లుగా సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగానే అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో తన బర్త్ డే రోజునే తన లవ్ స్టోరీ కి బ్రేకప్ అయ్యింది అని, ఆ అమ్మాయి తన బర్త్ డే రోజునే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్పాడు. తాను యుఎస్ లో పెరిగినా.. ఇండియా మీద విపరీతమైన ప్రేమ ఉంది అని చెప్పాడు శేష్.

కొన్నాళ్లు అమెరికాలోనే ఉద్యోగం చేశానని, కానీ తరువాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చేశానని చెప్పిన అడివి శేష్ ఇప్పటివరకు తాను డిఫరెంట్ రోల్స్ చేశానని, ఇప్పుడు ఓ ఫుల్‌టైమ్ లవ్ స్టోరీ చేయాలని ఉందని చెప్పాడు. ఇక తన ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యాక వేరే వారితో రిలేషన్ లో ఉన్నప్పటికీ.. పెళ్లి వరకు వెళ్లే ధైర్యం చెయ్యలేకపోయాను అని, ప్రస్తుతం తన దృష్టి పెళ్లిపైన లేదని, సినిమాల పైనే ఉంది అని, అలాగే మా ఫ్యామిలీ కూడా నన్ను పెళ్లి విషయంలో ఇబ్బంది పెట్టినా, ఇక నన్ను వదిలేసి నా చెల్లి పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్టుగా చెప్పుకొచ్చాడు అడివి శేష్.

Adivi Sesh shared his breakup love story:

Adivi Sesh Breakup story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ